Visakha Train Fire | రైలులో అగ్ని ప్రమాదం..

Visakha Train Fire | రైలులో అగ్ని ప్రమాదం..

Visakha Train Fire, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా – ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలు అర్థరాత్రి 1.30 నిమిషాలకు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ రైలులోని బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు పొగను గమనించి, తక్షణమే రైలును స్టేషన్‌లో ఆపేశారు. అయితే.. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపు మంటలు రెండు బోగీలకు పూర్తిగా వ్యాపించిడంతో ఆ రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై, తమ బోగీల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో B1 బోగీలో ఉన్న ఒకరు సజీవ దహనమయ్యారు. మృతుడు విశాఖకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70) గా గుర్తించారు.

మరో వైపు, రెండు బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట స్టేషన్‌కు 3 ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. అగ్నిప్రమాదానికి కారణం ఏంటి అనే దాని పై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన రైలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. రైల్వే భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ, తుని రైల్వేస్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి.

Leave a Reply