Yes Hyderabadi | ఔను .. హైదరాబాదీ
Yes Hyderabadi | ఔను .. హైదరాబాదీ
- నేర చరిత్ర లేదు
- 27 ఏళ్ల కిందటే ఆస్ట్రేలియాకు వలస
- యూరప్ యువతితో పెళ్లి
- ఇద్దరు బిడ్డలు .. నవీద్ పెద్దోడు
- కుటుంబంతో సంబంధాలు కట్
- ఆరు సార్లు హైదరాబాద్ వచ్చాడు
- తండ్రి అంత్య క్రియలకు దూరం

ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ :
Yes Hyderabadi : సిడ్నీ బోండి బీచ్‌లో (Bondi beech Terror) ఆదివారం సామూహిక కాల్పులకు తెగబడిన జంటలో తండ్రి సాజిద్ అక్రమ్ (Sajid Akram) భారతీయుడే. తెలంగాణ బిడ్డ. హైదరాబాద్ ( Yes Hyderabadi) లో పుట్టాడు. పెరిగాడు.మూడు దశాబ్దాల కిందటే ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. ఇండియన్ పాస్‌పోర్ట్‌ను (Indian passport Holder) అతడి కథను వివరించింది.
Yes Hyderabadi : ఈ కాల్పుల్లో అనుమానితుడు, సాజిద్ అక్రమ్ (50) పోలీసుల కాల్పుల్లో మరణించాడు. అతడి కుమారుడు, నవీద్ అక్రమ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రేరణతోనే వీరిద్దరూ కాల్పులు జరిపారని ఆస్ట్రేలియా దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. ఈ కాల్పులను టెర్రరిస్టు అభివర్ణించారు.
Yes Hyderabadi : ఇంతకీ సాజిద్ ఎవరు
సాజిద్ అక్రమ్ హైదరాబాదీ. 1998 నవంబర్‌లో విద్యార్థి వీసాపై (Student Visa) ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. ఉపాధి కోసం ఆస్త్రేలియాకు వెళ్లే ముందు సాజిద్ హైదరాబాద్‌లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ (B.com) చదివినట్టు తెలంగాణ పోలీసులు గుర్తించారు. అక్రమ్ దాదాపు 27 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. హైదరాబాద్‌లోని కుటుంబంతో (Family relation Cut) సంబంధాలు అంతంత మాత్రమే. అక్రమ్ రాడికలైజేషన్‌కు భారతదేశానికి మధ్య ఎటువంటి కార్యాచరణ లేదా సైద్ధాంతిక సంబంధం లేదని తెలంగాణ సీనియర్ పోలీసు అధికారులు నొక్కి చెప్పారు.
అక్రమ్ చివరిసారిగా 2022లో హైదరాబాద్ వచ్చాడు. అతను భారతీయ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్నాడు, అతని పిల్లలు – ఒక కుమారుడు కుమార్తె – ఆస్ట్రేలియాలో జన్మించారు వారందరూ ఆస్ట్రేలియా పౌరులే. కుటుంబ కలహాలతో హైదరాబాద్ తో సంబంధం తెగిపోయింది. చాలా కాలం నుంచి బంధువులు అతనితో సంబంధాలు తెంచుకున్నారు. 2017లో తన తండ్రి మరణించినప్పుడు ఆయన అంత్యక్రియల ప్రార్థనలకు అక్రమ్ హాజరు కాలేదు.
ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన తర్వాత, (Married) వెనెరా గ్రాసోను ( Venera Graso) పెళ్లి చేసుకున్నాడు, యూరోపియన్ మహిళగా ఆస్ట్రేలియా పోలీసులు అభివర్ణించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు నవీద్ ఒక కుమార్తె ఉన్నారు. ఈ కుటుంబం ఆస్ట్రేలియాలో శాశ్వతంగా స్థిరపడింది.
Yes Hyderabadi : ఉగ్ర శిక్షణకు వెళ్లారా?
దాడికి నెల రోజుల ముందు తండ్రీకొడకు (Father and Son) ఫిలిప్పీన్స్‌కు వెళ్లారు. ఈ పర్యటనపై కూడా ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాజిద్ అక్రమ్ , నవీద్ ఇద్దరూ నవంబర్ 28న (Went Phillipines) ఫిలిప్పీన్స్ వెళ్లారు. భారతీయ పాస్‌పోర్ట్ తో సాజిద్ అక్రమ్ , ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్ తె నవీద్ అక్రమ్ ప్రయాణించారు. ఈ జంట దక్షిణ నగరం దావో (Davo City) తమ చివరి మజిలీగా ప్రకటించారు. సిడ్నీకి తిరుగు ప్రయాణం టిక్కెట్టు బుక్ చేసుకున్నారు. దావో అనేది మిండానావో ద్వీపంలోని ఒక పెద్ద నగరం, ఈ ప్రాంతంలో ఇస్లామిస్ట్ గ్రూపులు చారిత్రాత్మకంగా దక్షిణ పశ్చిమ ప్రాంతాలలోని పేద ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అబు సయ్యఫ్ వంటి గ్రూపులు గతంలో ఇస్లామిక్ స్టేట్ అని పిలవబడే సంస్థకు విధేయత చూపాయి తక్కువ సంఖ్యలో విదేశీ ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇచ్చాయి.
ఈ ఇద్దరు వ్య తమ బసలో “సైనిక తరహా శిక్షణ (Milletary Trainig) పొందినట్టు అనుమానిస్తున్నారు. ఈ నివేదికలను వెంటనే ధృవీకరించలేమని ఫిలిప్పీన్స్ సైన్యం తెలిపింది. దశాబ్దాల సైనిక కార్యకలాపాలు ఈ ప్రాంతంలోని ఉగ్రవాద గ్రూపులను గణనీయంగా బలహీనపరిచామని, విదేశీ ఉగ్రవాదులు అక్కడ పనిచేస్తున్నట్లు ఇటీవల ఎటువంటి సూచనలు లేవని ఫిలిప్పీన్స్ భద్రతా అధికారులు తెలిపారు.

ALSO READ : Bondi Terror Mystory : అబ్బా కొడుకులే
