Yendapalli | ఫోన్లు వద్దు.. పుస్తకాలు ముద్దు

Yendapalli | ఫోన్లు వద్దు.. పుస్తకాలు ముద్దు

  • కొండాపూర్‌లో Read Village ఓపెన్ లైబ్రరీ ప్రారంభం

Yendapalli | ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఫోన్లు వద్దు.. పుస్తకాలు ముద్దు అనే నినాదంతో Read Village ఓపెన్ లైబ్రరీ కార్యక్రమాన్నిఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో సర్పంచ్ తాటిపర్తి రాజవ్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా Read Village ఓపెన్ లైబ్రరీ ఆర్గనైజర్ ఎ. ప్రేంసాగర్ మాట్లాడుతూ, పిల్లలు, యువతను పుస్తకాల వైపు దగ్గర చేసి చదవు అలవాటు పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామ ఉపసర్పంచ్ తనుగుల విజయ్ మాట్లాడుతూ, నేటి రోజుల్లో పిల్లలు, యువత ఫోన్లు, టీవీలు, సోషల్ మీడియాకు అధికంగా అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల కథల పుస్తకాలు, యువతకు స్ఫూర్తినిచ్చే పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన గ్రంథాలు, వివిధ నవలలను ప్రదర్శించారు. చిన్నపిల్లలు కథల పుస్తకాలను చదివి కథల ద్వారా నీతిని వివరించగా, కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎనగందుల రోజా రమేష్, గుమ్మడి రాజకుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు తనుగుల శ్రీనివాస్, సురేష్, GPO మహేష్, MRPS ఉమ్మడి వెల్గటూరు మండల అధ్యక్షులు చెన్న కుమారస్వామి, మన్నే జితేందర్, ఎలుక రమేష్, ఎల్కటూరి శ్రీధర్ (అడ్వకేట్), హర్షవర్ధన్, మన్నే సురేష్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పిల్లలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply