Market | స్కిన్‌లెస్ కిలో రూ.400

Market | స్కిన్‌లెస్ కిలో రూ.400

Market | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నాన్‌వెజ్ ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్. కోడి కూర కొండెక్కి కూర్చుంది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధ‌ర అమాంతం పెరిగిపోయింది. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.400కు చేరుకుంది. ఇంత ధ‌ర ఉంటే ఏం కొంటామ‌ని వినియోగ‌దారులు బేరుమంటున్నారు. ధరలు పెరగడంతో చికెన్ మార్కెట్‌లో కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. దాంతో వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కిలో చికెన్ ధర ఏకంగా రూ.400 (స్కిన్‌లెస్)కు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో బోన్‌లెస్ రూ.400కి పైగా విక్రయిస్తున్నారు. విజయవాడలో ఈరోజు కేజీ రూ.400గా నమోదయింది. గత వారం కిలో చికెన్ రూ.300గా ఉండగా.. ఇప్పుడు 400కు చేరింది. ఒక్కసారిగా రూ.100 పెరింగింది.