Winners | విజేతలకు బహుమతులు

Winners | విజయవాడ, ఆంధ్రప్రభ : నగరంలోని మున్సిపల్ స్టేడియం, టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఖేలో ఇండియా, అస్మిత సాఫ్ట్ టెన్నిస్ లీగ్ (సౌత్ జోన్) వారు సంయుక్తంగా నిర్వహించిన టోర్నీలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఏపీ శాప్ (స్పోర్ట్స్ అథారిటీ) చైర్మన్ రవినాయుడు, బీజేపీ స్టేట్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రొటోకాల్ ఇన్చార్జి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యక్రమానికి హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, ఒడిశా సెక్రటరీలు పాల్గొన్నారు.
