crime | మద్యం మత్తులో యువకుల దాడి అనుమానం

crime | మద్యం మత్తులో యువకుల దాడి అనుమానం

crime | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్‌ : కాకినాడలో ఓ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. గాంధీనగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు ప్రాణాలు కోల్పోయారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.

అర్ధరాత్రి దాడితో మృతి…

ఆదివారం అర్ధరాత్రి సమయంలో గాంధీనగర్ ప్రాంతంలో నాగేశ్వరరావుపై దుండగులు తీవ్రంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఘటనాస్థలికి ఏఎస్పీ, క్లూస్ టీమ్…

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏఎస్పీతో పాటు క్లూస్ టీమ్ ఘటనాస్థలిని పరిశీలించి ఆధారాలు సేకరించింది. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.