విస్తృతంగా హనుమాన్ మాలధారణ
విస్తృతంగా హనుమాన్ మాలధారణ
- శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో
- భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల వసతులు
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం మల్లక్క పేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ భక్తులు విస్తృతంగా హనుమాన్ మాలధారణలు నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం ప్రధాన అర్చకులు కాటూరి జగన్నాథచార్య ఆధ్వర్యంలో పరకాల పట్టణ, మండలంలోని గ్రామాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి హనుమాన్ మాలధారణలు నిర్వహించడం జరిగింది.
మంగళవారం రోజు ఉదయం ప్రధాన అర్చకులు కాటూరి జగన్నాథచార్య ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులు మాలధారణ చేసి హనుమాన్ నామస్మరణతో ఆలయంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. మాలాధారణ చేసిన భక్తులకు తక్కువ రుసుముతో బిక్షను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. హనుమాన్ మాలధారణ కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శరత్ చంద్ర, ఆలయ సిబ్బంది రమేష్, పరకాల పట్టణ, మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
