An honor l అంధత్వాన్ని జయించిన నాగరాజుకు ఎంపీ, ఎమ్మెల్యే సన్మానం
An honor l అంధత్వాన్ని జయించిన నాగరాజుకు ఎంపీ, ఎమ్మెల్యే సన్మానం
అంధత్వాన్ని జయించి గ్రూప్-2 ఉద్యోగం సాధించిన నందం నాగరాజు
An honor l చల్లపల్లి, ఆంధ్రప్రభ: అంధత్వాన్ని ఆత్మవిశ్వాసంతో జయించి గ్రూప్-2 ఉద్యోగం సాధించిన నందం నాగరాజును మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అభినందించారు. చల్లపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాగరాజుకు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు పద్మశాలిపేటకు చెందిన నాగరాజు తొమ్మిదో తరగతిలో రోడ్డు ప్రమాదానికి గురై రెండు కళ్ళు పోగొట్టుకున్నాడు. చిన్న వయసులోనే తండ్రిని కూడా కరెంట్ షాక్ రూపంలో పోగొట్టుకున్న నాగరాజు తల్లి ప్రోత్సాహంతో చదువుకుని తాజా గ్రూప్-2 ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, చల్లపల్లి, లక్ష్మీపురం సర్పంచులు పైడిపాముల కృష్ణకుమారి, కొల్లూరి కోటేశ్వరరావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి తోట మురళీకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ బొందలపాటి వీరబాబు, ఏఎంసీ డైరెక్టర్ సూదాని నందగోపాల్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
