Road Accident | పికప్ వాహనం – ట్రక్కు ఢీకొని.. ఏడుగురు మృతి..
Road Accident | పికప్ వాహనం – ట్రక్కు ఢీకొని.. ఏడుగురు మృతి..
Road Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వాహనం, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
జలాలాబాద్ నుంచి అమృత్‌సర్‌లోని బియాస్‌కు వెళ్తున్న సమయంలో ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా రోడ్డులోని జంగావాలా మోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న వేగానికి వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
