Peddi | క్షమాపణలు చెప్పిన ‘పెద్ది’ డైరెక్టర్..
Peddi | క్షమాపణలు చెప్పిన ‘పెద్ది’ డైరెక్టర్..
Peddi | జాన్వీ కపూర్ పాత్రపై నెగెటివ్ ఫీడ్‌బ్యాక్
ప్రేక్షకుల అభిప్రాయాలకు దర్శకుడి గౌరవం
అభ్యంతరకర సన్నివేశాల మార్పుకు సిద్ధం
మహిళా పాత్రల ప్రెజెంటేషన్‌పై బుచ్చిబాబు హామీ
Peddi | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రానికి సంబంధించి దర్శకుడు బుచ్చిబాబు సానా ఊహించని నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర ప్రెజెంటేషన్‌పై వచ్చిన విమర్శలు, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకున్న ఆయన.. అభ్యంతరకరంగా భావించిన కొన్ని సన్నివేశాలను మార్చనున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని బుచ్చిబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. సినిమా అనేది ప్రేక్షకులను అలరించడానికే గానీ, ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి లేదా ఎవరి గౌరవానికైనా భంగం కలిగించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. ‘పెద్ది’ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి వచ్చిన అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు తెలిపారు.

మహిళల పట్ల తనకు ఆఫ్‌స్క్రీన్, ఆన్‌స్క్రీన్ ఎంతో గౌరవం ఉందని బుచ్చిబాబు పేర్కొన్నారు. ఏ పాత్రనైనా తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. సినిమాలో జాన్వీ కపూర్ ప్రెజెంటేషన్ ఎవరి మనోభావాలనైనా బాధించి ఉంటే హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ సినిమాలోని అభ్యంతరకరంగా భావించిన సన్నివేశాలను మార్చబోతున్నట్లు ఆయన ప్రకటించారు. మారుతున్న ప్రేక్షకుల ఆలోచనలు, సెన్సిటివిటీస్‌కు తాము బాధ్యత వహిస్తామని చెప్పారు. భవిష్యత్తులో మహిళా పాత్రలను మరింత గౌరవప్రదంగా చూపించేందుకు జాగ్రత్తలు తీసుకుంటామని బుచ్చిబాబు హామీ ఇచ్చారు.

‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో దర్శకుడు తీసుకున్న ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ వెంటనే స్పందించడం పాజిటివ్‌గా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
CLICK HERE TO READ Lenin Song | లెనిన్ నుంచి కొత్త సాంగ్..!
