‘ఆ’ ‘పలక’ని రేపటి బాలుడు కథనానికి స్పందించిన విద్యాశాఖ..

‘ఆ’ ‘పలక’ని రేపటి బాలుడు కథనానికి స్పందించిన విద్యాశాఖ..

బాలుని ఇంటి వద్దకు వెళ్లి..
పరిస్థితిపై వైరా ఎంఈఓ ఆరా…

ఆధార్ కార్డు ఇప్పిస్తాం…
బడిలో చదివిస్తాం…

వైరా ఎంఈఓ చావా శ్రీనివాసరావు..

పేద కుటుంబానికి అండగా నిలిచిన.
మేడా శంకరయ్య సుశీల చారిటబుల్ ట్రస్ట్..

నిత్యవసర వస్తువులు క్వింటా బియ్యం వితరణ..

వైరా, ఆంధ్రప్రభ:

ఆ పలకని రేపటి పౌరుడు అనే కథనం ఆంధ్రప్రభ వెబ్ న్యూస్ లో రావటంతో వైరా విద్యాశాఖ వెంటనే స్పందించింది… ఇటీవల కాలంలోనే నూతన విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన చావా శ్రీనివాసరావు మానవీయ కోణంలో స్పందించారు… 13 ఏళ్లు వయస్సు వచ్చిన ఆధార్ కార్డు లేకపోవడం, బడి బయట బాలుని కథనం ఆయనను ఎంతో ప్రభావితం చేసి చలింప జేసింది. వెంటనే హుటా హుటిన బాలుని ఇంటికి చేరుకున్నారు…. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని గమనించారు… బాలుని నాయనమ్మతో కొంతసేపు మాట్లాడారు… చదువు యొక్క ఆవశ్యకతను ఆమెకు తెలియజేశారు… వెంటనే పాఠశాలలో చేర్పిస్తామని తమకు సహకరించాలని ఆమెను కోరారు… 13 ఏళ్ల బడి బయట బాలుని జీవనశైలి, నడవడికను పరిశీలించి… అనంతరం బల్లో చేర్పించేందుకు అందరినీ ఒప్పించారు… అనంతరం..

స్పందించిన దాతృ హృదయం…

మేడ శంకరయ్య సుశీల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు అభినందనలు…

బాలుని దేన పరిస్థితిపై ఆంధ్రప్రభ వెబ్ న్యూస్ ని చదివిన… వైరా మండల పరిధిలోని విప్పలమడక గ్రామ సర్పంచ్., మేడ శంకరయ్య సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు . మేడా హేమిమా చక్రపాణి మంచి హృదయంతో స్పందించారు.. వెంటనే దారిద్రానికి దిగున కడు పేదరికం లో బతుకుతున్న ఆ కుటుంబానికి.. సాయం చేసేందుకు ముందుకు వచ్చారు… క్వింటా బియ్యం నిత్యవసర సరుకులు వంట గ్యాస్ బండను వితరణగా అందించారు… ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు… దీంతో మంచి మనసుతో స్పందించిన మేడా శంకరయ్య సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను పలువురు అభినందిస్తున్నారు.

Leave a Reply