సోలార్ ప్యానల్స్ ని ఎత్తుకెళ్లిన దొంగలు..

సోలార్ ప్యానల్స్ ని ఎత్తుకెళ్లిన దొంగలు..
టేకుమట్ల, ఆంధ్రప్రభ: భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావు పల్లి గ్రామ శివారు ఆకులపల్లి సమీపంలో ఆకుల పెద్ద తిరుపతిఅనే వ్యక్తి తన పంట చేనును అడవి జంతువుల నుండి పంటలను రక్షించుకోవడానికి సోలార్ ఏర్పాటు చేశారు కాగా సోలార్ ప్యానల్స్ ను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. సోలార్ ప్యానల్స్ తో పాటు స్టార్టర్ బాక్సులను కూడా ఎత్తుకెళ్లారు. సుమారు రూ. 17000 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
