జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కోడం శివకృష్ణ

కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కోడం శివకృష్ణ నియమితులైనారు. కోడం శివకృష్ణ నియామకం పట్ల బుధవారం పలువురు, నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని పార్టీ అభివృద్ధితో పాటు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు.రాబోయే రోజుల్లో నగరంలో కాంగ్రెస్ పార్టీని మరింతగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.