Top10AP| టాప్-10 ఎమ్మెల్యేల జాబితాలో ఆ ఇద్దరు…

Top10AP| టాప్-10 ఎమ్మెల్యేల జాబితాలో ఆ ఇద్దరు…

నంబర్-1 స్థానంలో గద్దె రామ్మోహన్..
ఏడో ర్యాంక్‌లో సుజనా చౌదరి
ప్రజాసేవ, అభివృద్ధి, సంక్షేమం…
అందుబాటు పాలనకు ప్రజల మన్ననలు
రెండేళ్ల కూటమి పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ…
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ర్యాంకింగ్స్..

Top10AP|
Top10AP|

Top10AP| ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రజాప్రతినిధుల పనితీరుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో విజయవాడకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్ర టాప్-10 జాబితాలో చోటు దక్కించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైజ్ (రైస్ – రీసెర్చ్ , కన్సులటింగ్ & మానేజ్మెంట్ ) సంస్థ విడుదల చేసిన ‘టాప్-10 పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేలు ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ జాబితాలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తొలి స్థానంలో నిలవగా, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వైఎస్ చౌదరి ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Top10AP| పనితీరే కొలమానకంగా..

రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల నాయకత్వ లక్షణాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు అందుబాటులో ఉండటం, సమస్యల పరిష్కారంలో చొరవ, ప్రజా సంక్షేమంపై దృష్టి వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది. ఈ జాబితాలో తొలి పది స్థానాల్లో ఇద్దరు విజయవాడ ఎమ్మెల్యేలు చోటు దక్కించుకోవడం ఎన్టీఆర్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

Top10AP| మళ్లీ సత్తా చాటిన ఆ ఇద్దరు..

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, ప్రజలతో నిరంతర సంబంధాలు, స్థానిక సమస్యల పరిష్కారంలో చురుకుదనం వంటి అంశాలలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్‌కు తొలి స్థానం దక్కేందుకు దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న యలమంచిలి సత్యనారాయణ( సుజనా ) చౌదరి కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్‌లో స్థానం సంపాదించడం విశేషంగా మారింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో కూడా గద్దె రామ్మోహన్రావు తో పాటు సుజనా చౌదరికి కూడా టాప్ టెన్ లో చోటు దెక్కింది.

Top10AP| ఎప్పుడూ విజయవాడ ప్రత్యేకమే.

రాష్ట్ర రాజకీయాల్లో విజయవాడకు ఎప్పటికప్పుడు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, ఒకే నగరానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్ర టాప్-10 జాబితాలో నిలవడం అరుదైన ఘట్టంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సమయంలో వెలువడిన ఈ ర్యాంకింగ్స్ ప్రజా ప్రతినిధుల పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెబుతున్నారు. ఈ సర్వే ఫలితాలతో విజయవాడ రాజకీయ ప్రాధాన్యం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు రావడంతో పాటు, అభివృద్ధి, ప్రజాసేవల విషయంలో నగర ప్రజాప్రతినిధుల పనితీరుకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ స్పష్టమైందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

click here to read more : glodratejump|24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,080.కొనుగోలుదారులకు షాక్!

click here to read more :