భూమాత ఆశీస్సులతో సమృద్ధిగా పంటలు పండాలి..
- ఏరువాక పౌర్ణమిలో ఫసల్వాది సర్పంచ్ హరి ప్రసాద్ ముదిరాజ్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఏరువాక పౌర్ణమి రైతుల తొలి పండుగ అని, పాడిపశువులు–భూమాతను ఆరాధిస్తూ వ్యవసాయ పనులకు శ్రీకారం చుడితే ప్రకృతి అనుగ్రహంతో సమృద్ధిగా పంటలు పండుతాయని ఫసల్వాడి గ్రామ సర్పంచ్ హరి ప్రసాద్ ముదిరాజ్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామ రైతులు ట్రాక్టర్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి సంప్రదాయబద్ధంగా ఏరువాక పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ హరి ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయానికి ఆధారమైన పాడిపశువులను పూజించి, భూమాతకు నమస్కరించడం ద్వారా మంచి వర్షాలు కురిసి పచ్చని పంటలతో పొలాలు కళకళలాడాలని ఆకాంక్షించారు. రైతులు సకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభించి సమృద్ధిగా పంటలు పండించి ఆర్థికంగా వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గ్రామంలో రైతులంతా ఐక్యంగా పాల్గొని ఏరువాక పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించడంతో పండుగకు ప్రత్యేక శోభ నెలకొంది. ఈ సందర్భంగా సర్పంచ్‌ను గ్రామ పెద్దలు, రైతులు, యువకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
