గ్రామ దేవత ఊర లక్ష్మమవ్వ ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం

మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి నుంచి నగదు, సిమెంటు అందజేత

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కొత్త గార్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ దేవత ఊర లక్ష్మమవ్వ ఆలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సోదరుడు, మాజీ ఉపసర్పంచ్ వాకిటి శేషగిరి సోమవారం లక్ష రూపాయల నగదుతో పాటు 50 బస్తాల సిమెంటును గ్రామ పెద్దలకు అందజేశారు.

ఈ సందర్భంగా వాకిటి శేషగిరి మాట్లాడుతూ, మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, 50 బస్తాల సిమెంటును అందించినట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న ఆలయాలకు కూడా మంత్రి వాకిటి శ్రీహరి ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అశోక్ గౌడ్, గజ్జెలి అశోక్, అంజి, కురువ గోపాల్, కురువ లక్ష్మన్న, గ్రామ పెద్ద కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కావలి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.