అంబేద్కర్ ఆదర్శనీయుడు

అంబేద్కర్ ఆదర్శనీయుడు
తహసీల్దార్ దిలీప్ కుమార్
లక్షేట్టిపేట, ఏప్రిల్ 14 (ఆంధ్ర ప్రభ) : భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శనీయుడని తహసీల్దార్ దిలీప్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, మార్గదర్శకుడు బాబా సాహెబ్ అంబేద్కర్ సేవలు మరువలేనివన్నారు. భారత దేశ భవిష్యత్ ను ముందే ఊహించి రాజ్యాంగాన్ని అత్యంత జాగ్రత్తగా రూపొందించిన ఘనత అంబేద్కర్ కు దక్కుతుందన్నారు. మహిళ హక్కులు, 8 గంటల పని విధానం, భారీ నీటి ప్రాజెక్టుల ప్రత్తిపాదన, ఆర్ బీ ఐ ఏర్పాటు లాంటి ఎన్నో కీలక రంగాల్లో బహుముఖ ప్రతిభ కనబర్చిన విజ్ఞాని అంబేద్కర్ అని కొనియాడారు.ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. విద్యతోనే అన్ని రకాల అజ్ఞానాన్ని తొలగించుకోవచ్చని ప్రపంచానికి చాటిన మహనీయుడు అంబేద్కర్ అని వివరించారు. అంతకుముందు రెవెన్యూ సిబ్బందితో కలిసి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులార్పించారు.ఈ కార్యక్రమంలో డీ టీ శ్రావణి, ఆర్ ఐ సునీత, జీ పీ ఓ లు, సిబ్బంది పాల్గొన్నారు.
