Jainoor | సీఎం దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకున్న పోలీసులు
Jainoor | సీఎం దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకున్న పోలీసులు
Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : రాజకీయ కుట్ర తోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ అధికారులతో ఫోన్ క్యాప్టింగ్ పేరట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో విచారణ చేస్తున్నారని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు అన్నారు. ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ అధికారులు విచారణకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ జైనూర్ మండల కేంద్రంలోని కొమరం భీమ్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ యాదవరావు తో పాటు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పూర్తిగా విస్మరించిందని హామీల అమలు చేయకుండా పక్కదోహ పట్టించడానికి కుక్క చేశారని ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చకుండా మోసం చేస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు.
హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూన్నారని, విమర్శ రాస్తారోకో లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇంతియాజులాల రాష్ట్ర రోకో నిరసన కార్యక్రమానికి తీసుకురాగా ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజులాల, మాజీ సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షులు మడవి భీమరావు, సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
