జ్యోతిష్య శాస్త్రంలో విశిష్ట సేవలకు అవార్డు

పెద్దపల్లి పండితుడికి తెలంగాణ జ్యోతిష్య విజ్ఞాన సభ పురస్కారం

పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వేద పండితులు, జ్యోతిష్య శాస్త్రవేత్త కొండపాక శ్రీనివాసాచార్యులు ఉత్తమ జ్యోతిష్య అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ జ్యోతిష్య విజ్ఞాన సభ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన విశిష్ట గౌరవ పురస్కార ప్రదానోత్సవంలో ఆయనకు విశిష్ట సేవా పురస్కారాన్ని వేణుగోపాల చారి చేతుల మీదుగా అందజేశారు.
వేద, జ్యోతిష్య శాస్త్రాల అభివృద్ధికి, ప్రజలకు జ్యోతిష్య సేవలను అందించడంలో శ్రీనివాసాచార్యులు చేస్తున్న విశేష కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు సభ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ గౌరవాన్ని అందించిన తెలంగాణ జ్యోతిష్య విజ్ఞాన సభ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు మరింత బాధ్యతతో సేవలు అందించేందుకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆయనకు ఈ పురస్కారం లభించడంతో పెద్దపల్లి ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు, శిష్యులు, అభిమానులు అభినందనలు తెలిపారు.