ఎన్యుమరేషన్ పత్రాలు గడువులోగా బీఎల్‌వోలకు అందజేయాలి: కోరం మహేష్ రెడ్డి

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఓటరు తమ ఎన్యుమరేషన్ పత్రాలను నిర్ణీత గడువులోగా బీఎల్‌వోలకు అందజేయాలని ఊట్కూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి కోరారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేటలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఎన్యుమరేషన్ పత్రాల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్లందరూ బాధ్యతగా స్పందించి అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పించి నమోదు ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మైనార్టీ మండల అధ్యక్షులు జలాల్, వార్డు సభ్యురాలు సువర్ణ రవికుమార్ మాజీ ఎంపీటీ సి శివరామరాజు, బిఎల్ వో జ్యోతి, కాంగ్రెస్ నాయకులు ఎం. అశోక్, రాఘవేందర్ గౌడ్, అస్మత్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.