గ్రామాల్లోని వనరులను సద్వినియోగం చేసుకోవాలి..
బోధన్ రూరల్ (ఆంధ్రప్రభ): గ్రామాల్లో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని బోధన్ డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు సూచించారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై గురువారం సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న సహజ వనరులు, వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. మంచినీటి సరఫరా, విద్యుత్ మోటార్ల నిర్వహణ, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే చెత్త సేకరణ, డంపింగ్ యార్డుల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా అధికారులు, డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారి సాయగౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
