దాసాంజనేయ స్వామి ఆలయంలో చోరీకి యత్నం

గుడివాడ, ఆంధ్రప్రభ: కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని 25వ వార్డు పరిధిలో ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయంలో చోరీకి యత్నించిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.ఆలయంలో హుండీ, తాళాలు పగులగొట్టి చోరీకి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అనంతరం గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద వారిని గుర్తించి పట్టుకున్నట్లు సమాచారం.

స్థానికులు ఇద్దరినీ గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలోని నాగేంద్రస్వామి ఆలయంలోనూ హుండీ పగులగొట్టి నగదు చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. వరుసగా ఆలయాల్లో చోరీ ఘటనలు చోటుచేసుకోవడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేయాల్సి ఉంది.