శ్రీసమర్థరామదాసు స్వామి పాదుకపూజలు

శ్రీసమర్థరామదాసు స్వామి పాదుకపూజలు
జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కన్నాముందు జుక్కల్ మండలంలో ప్రసిద్ధిగాంచిన శ్రీగోవింద్ మఠ్ సంస్థాన్ ఆధ్వర్యంలో మఠాధిపతి శ్రీ గోపాల్ గోవింద్ మహారాజ్ వారి సారథ్యంలో భిక్షా కార్యక్రమంతో పాటు శ్రీసమర్థ రామదాసుస్వామి పాదుకపూజ కార్యక్రమాలు గ్రామ, పట్టణ స్థాయిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. శ్రీ గోవింద్ మఠ్ సంస్థాన్ శ్రీ సమర్థరామదాసు స్వామి వారి పరంపరలో కొనసాగుతు ఉండటంతో పట్టణ స్థాయిలో శ్రీ సమర్థ రామదాసుస్వామి వారి పాదుకపూజల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
దీనిలో భాగంగా బిచ్కుంద మండల కేంద్రంలో శ్రీ సమర్థ రామదాసు స్వామి పాదుకపూజ భక్తి కార్యక్రమం వైభవంగా కొనసాగింది. శ్రీ కేశవ్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగింది.

