మెక్సికో లో( Mexico ) మరోసారి తుపాకీ కాల్పులతో ( gun fire) దద్దరిల్లింది. మెక్సికోలో జరుగుతున్న వేడుకలపై (celebrations) ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. 12 మంది చనిపోగా..మరో 20 మంది గాయపడ్డారు. దీంతో ఉత్సాహంగా జరుగుతున్న వేడుకలు.. ఒక్కసారిగా విషాదంగా మారాయి.
మెక్సికోలోని గ్వానాజువాటోలోని ఇరాపువాటోలో సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ గౌరవార్థం ఒక ఇంటి సమీపంలో వేడుకలు జరుగుతున్నాయి. స్థానికులు మద్యం సేవించి నృత్యం చేశారు. బ్యాండ్ వాయిస్తుండగా అందుకు తగ్గట్టుగా డ్యాన్స్‌లు చేశారు. అందరూ ఉత్సాహంగా నృత్యం చేస్తుండగా దుండగులు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. సంఘటనాస్థలిలోనే 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మంది గాయపడ్డారు.
ఈ ఘటనను మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.