TDP | వెనక్కి తగ్గేదాకా..

TDP | వెనక్కి తగ్గేదాకా..
TDP | గుడివాడ, ఆంధ్రప్రభ : వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ (GUDIVADA) ముబారక్ సెంటర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి గుడివాడ నియోజకవర్గంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను అన్నారు. వైయస్సార్సిపీ కృష్ణాజిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాసిం (అబు), ఎస్.కె అలీ సాహెబ్ (బాజీ) ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) కృషితో సాకారమైన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై వెనక్కి తగ్గేదాకా పోరాడుతామన్నారు. పేద విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చేయగా,7 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి అన్నారు. మరో 10 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని.. కూటమి ప్రభుత్వం చేతకానితనం వల్లే.. 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని.. ప్రజలు నేడు తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నారని చెప్పారు. ముఖ్యంగా రైతుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో షమ్ము, ధనియాల పేట భాష, ఆగస్త కృష్ణమోహన్, చుండూరి శేఖర్, రమణ కుమార్, కార్మిక నగర్ నూర్, కరీముల్లా, అబ్దుల్ రజాక్, రమీజా తదితరులు పాల్గొన్నారు.
