Deputy CM | బొట్టు తుడిచేశారన్న ఆరోపణలు..

Deputy CM | బొట్టు తుడిచేశారన్న ఆరోపణలు..

Deputy CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలయ దర్శనం చేసిన ఆయనపై కొత్త ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ ఆలయాన్ని సందర్శించిన ఉదయనిధి స్టాలిన్, అక్కడ బొట్టు పెట్టుకుని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ చర్య అప్పటికే రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది.

గతంలో సనాతన ధర్మంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు ఆలయ దర్శనం చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆయన బొట్టును తుడిచివేశారని ఆరోపణలు రావడం మరింత వివాదానికి దారి తీసింది. ఈ అంశం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply