Provident Fund | జీపీఎఫ్ బకాయిలు రూ.2 వేల కోట్లు విడుదల

Provident Fund | జీపీఎఫ్ బకాయిలు రూ.2 వేల కోట్లు విడుదల

రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట

Provident Fund | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) బకాయిల చెల్లింపుల కోసం రూ.2 వేల కోట్లను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వంద రోజుల్లో రూ.6 వేల కోట్ల జీపీఎఫ్ బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ అమలులో భాగంగానే తొలి విడతగా రూ.2 వేల కోట్లను విడుదల చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

జీపీఎఫ్ బకాయిల చెల్లింపుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. మిగిలిన బకాయిలను కూడా దశలవారీగా విడుదల చేసి, వంద రోజుల గడువులోపు మొత్తం రూ.6 వేల కోట్ల చెల్లింపులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి.

Leave a Reply