క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి

క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం

వికారాబాద్, ఆంధ్రప్రభ : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి పేర్కొన్నారు.

బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి పాఠశాలలో విద్యార్థులకు కోకో పోటీలను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు, వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.