కర్నూలులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..
కర్నూలు, ఆంధ్రప్రభ: నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఆహార శుద్ధి, వాణిజ్య శాఖ మంత్రి టి.జి. భరత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి మంత్రి భరత్ పరేడ్‌ను వీక్షించారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

తదుపరి మంత్రి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. జిల్లా ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు హాజరయ్యారు. పరేడ్ మైదానం జాతీయ జెండా రెపరెపలతో, దేశభక్తి నినాదాలతో సందడిగా మారింది.
