ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భూత్పూర్ (ఆంధ్రప్రభ): భూత్పూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

జాతీయ పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముడావత్ బాలకోటి, మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్, కౌన్సిలర్లు పద్మ, లాలూ నాయక్, అన్నపూర్ణ, గడ్డం ప్రేమ్ కుమార్, చంద్రకళ, లత, మండల అధ్యక్షుడు కేసీ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ శేఖర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.