కాజీపేటలో చైన్ స్నాచింగ్ కలకలం..

కాజీపేటలో చైన్ స్నాచింగ్ కలకలం..
కాజీపేట, ఆంధ్ర ప్రభ : జీపేట బాపూజీ నగర్‌లోని కారుణ్య క్లినిక్ వద్ద ఒక మహిళ మెడలోని సుమారు మూడు తులాల బంగారు గొలుసును బైక్ మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు స్నాచింగ్ సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.బాధితురాలు ధనలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, గత కొద్ది నెలలుగా కారుణ్య హాస్పిటల్ గల్లీలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ, కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న అని తెలిపారు.
బుధవారం పని ముగించుకుని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మెయిన్ రోడ్డు వద్ద ఆటో దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి మరొక వ్యక్తి ముఖానికి కర్చు కట్టుకొని మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. వెంటనే ధనలక్ష్మి విషయాన్ని పోలీసులకు తెలిపారు. కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులను పట్టుకునేందుకు సంఘటన స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.
