మదన్ హిప్పర్గాలో ఉచిత పశువైద్య శిబిరం..

డోంగ్లీ, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని మదన్ హిప్పర్గా గ్రామంలో శుక్రవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు,గ్రామ సర్పంచ్ బచావార్ లక్ష్మణ్ శిబిరాన్ని ప్రారంభించారు. పశు వైద్యాధికారి డా. వినీత్ కుమార్ పర్యవేక్షణలో పశువులకు వైద్య పరీక్షలు, చికిత్సలు అందించారు.

27 పశువులకుసాధారణ చికిత్స 19 పశువులకు గర్భ కోశ నివారణ చికిత్స 11 దూడలకునట్టల నివారణ మందు 52 గొర్రెలకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ మొత్తం 109 పశువులకు ఉచితంగా వైద్య సేవలు అందించినట్లు డా. వినీత్ కుమార్ తెలిపారు.

సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. రైతులే రాజు అని నమ్మే ప్రభుత్వం మనది.పంటలతో పాటు పశు సంపదను కాపాడుకోవడం కూడా ముఖ్యం.99 రోజుల ప్రణాళికలో ఇలాంటి శిబిరాలు ప్రతి గ్రామంలో నిర్వహిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు,కార్యక్రమంలో ఉప సర్పంచ్ గైక్వాడ్ సరుబాయి,వార్డ్ మెంబర్ మల్లికార్జున్ దస్తూరే,పశు వైద్య సిబ్బంది జి.శంకర్,జి.సయ్యాజి,కే.చంద్రశేఖర్ రైతులు,పశు పోషకులు పాల్గొన్నారు.