TRS Youth Committee | ప్రకటించిన కల్వకుంట్ల కవిత
రాష్ట్ర అధ్యక్షుడిగా కంచర్ల శివారెడ్డి..
ప్రధాన కార్యదర్శిగా కంచిగారి ప్రవీణ్ ముదిరాజ్
TRS Youth Committee | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యువజన విభాగం రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు యువతకు కీలక బాధ్యతలు అప్పగించే క్రమంలో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నియామకాలలో భాగంగా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కంచర్ల శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కంచిగారి ప్రవీణ్ ముదిరాజ్‌లను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
నూతనంగా నియమితులైన నాయకులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతను పార్టీ వైపు ఆకర్షించి, రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగత విస్తరణకు కృషి చేయాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి యువజన కమిటీలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
