దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన తెరాస నాయకులు

బోధన్, ఆంధ్రప్రభ ; అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను బోధన్ మాజీ శాసనసభ్యులు షకీల్ అమేర్ ఆదివారం పరిశీలించారు.సాలుర మండలంలోని గ్రామాలలో శనివారం రాత్రి వడగళ్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి మొక్కజొన్న వరి పంటలు దెబ్బతినడంతో పాటు మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి. పంట చేతికి వచ్చే సమయం లో ఈ వడగళ్ళ వాన రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది.రైతులు కోలుకోలేని విధంగా వర్షం దెబ్బ తీసిందని అన్నారు.రైతులను ప్రభుత్వం ఆదు కోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంట కేంద్ర సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ గంగారెడ్డి,జాడి నర్సయ్య,టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.