సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ

సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :- కమ్మర్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రేగుంట దేవేందర్ రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు.బుధవారం ఏఎంసి చైర్మన్ పాలెపు నర్సయ్య,వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న,సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్,ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ లతో కలిసి జిలగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 కిలోల జీలుగ విత్తనాల బస్తా మొత్తం ధర రూ.4,905 ఉండగా,50 శాతం ప్రభుత్వ సబ్సిడీ పోగా,రైతు రూ. 2,453 చెల్లించాలన్నారు.జీలుగ విత్తనాలు అవసరం ఉన్న రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వచ్చి విత్తనాలు తీసుకోవాలని కోరారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రేంజర్ల మహేందర్,విడిసి చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్,మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, సంత రాజేశ్వర్,బద్రి,తీగల హరీశ్, ఏంఏవో టి. రమ్యశ్రీ,ఏఈవో లు కావ్య,రమేష్,రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
