NEWS@12:00 P.M | 7 జూలై 2026 ముఖ్యాంశాలు

NEWS@12:00 P.M | 7 జూలై 2026 ముఖ్యాంశాలు

మార్కెట్‌లో బ్యాంకుల జోరు..

బ్యాంకింగ్ రంగంపై మదుపర్లలో పెరుగుతున్న ఆశలు దేశీయ స్టాక్ మార్కెట్లకు కొంత మద్దతుగా నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగం మెరుగైన లాభాలను నమోదు చేసే అవకాశం ఉందనే అంచనాలతో ఆ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. click here to read the full story

ఒకే కుటుంబంలో ఐదుగురి మృత్యువాత

మధ్యప్రదేశ్‌లోని మైహార్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుక నుంచి తిరిగి వస్తున్న ఓ కుటుంబం ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. click here to read the full story

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత‌

భువనగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. click here to read the full story

అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి..

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని ప్రసన్న అట్లూరి మృతి చెందారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్‌ను ఉల్లంఘించడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రసన్న అట్లూరి తీవ్రంగా గాయపడగా, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. click here to read the full story

అయోధ్యలో అవకతవకలపై కీలక ఆధారాలు

అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారంలో అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అధికారులు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం సిట్ అధికారులు యూపీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న కొందరు వ్యక్తులు డబ్బులను అపహరిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. click here to read the full story

అజేయంగా ప్లేఆఫ్స్‌లోకి హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌

 టీజీ20 తొలి సీజన్‌లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఈ జట్టు లీగ్‌ దశను ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా ముగించింది. సోమవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో నల్గొండ నైట్స్‌ను ఓడించి తమ విజయ పరంపరను కొనసాగించింది. click here to read the full story

న్యూడ్ కాల్స్ దందా Andhra Prabha Crime Story

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో న్యూడ్ కాల్స్, వ్యభిచార దందా వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. బాధితురాలి గోడు సోషల్​ మీడియాలో వైరల్​ అవెతోంది ఈ వ్యవహారం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. పదేళ్లుగా తనను భర్తే వ్యభిచారంలోకి నెట్టాడని, ఆ దందా ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని అతడికే అప్పగించానని, తనకు తెలియకుండా గదుల్లో రహస్యంగా చిత్రీకరణ కూడా జరిగి ఉండొచ్చని ఆమె చేసిన ఆరోపణలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ సాగుతుండగా, పోలీసులు కూడా ప్రాథమిక విచారణకు సిద్ధమవుతున్నారు. click here to read the full story