మాదక ద్రవ్యాలపై యుద్ధం చేద్దాం..

  • డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం..
  • కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : మాదక ద్రవ్యాలపై యుద్ధం చేద్దామని, కరీంనగర్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పిలుపునిచ్చారు. గురువారం మాదకద్రవ్యాల దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆదేశాల మేరకు జరుగుతున్న యాంటీ డ్రగ్ అవేర్నెస్ : ‘క్ లో భాగంగా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. కలెక్టరేట్ నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు 2 కి.మీ. మేర సాగిన ర్యాలీలో వివిధ విద్యాసంస్థల, నర్సింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గీతాభవన్ చౌరస్తాలో నర్సింగ్ విద్యార్థినులు ప్రదర్శించిన వీధి నాటకం, అవగాహన గీతాలు అందరినీ ఆలోచింపజేశాయి. స్కిట్తోతో కళ్లకు కట్టిన వాస్తవం ర్యాలీ అనంతరం కన్వెన్షన్ హాలులో సీపీ గౌష్ ఆలం అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోస్టర్లను ఆవిష్కరించి, షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించారు. చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల విద్యార్థుల స్కిట్ డ్రగ్స్ వల్ల యువత జీవితాలు, కుటు ంబాలు ఎలా నాశనమవుతాయో కళ్ళకు కట్టింది. నర్సింగ్ విద్యార్థినుల నృత్య ప్రదర్శన డ్రగ్స్ రహిత సమాజంపై సందేశమిచ్చింది.

క్రీడలపై దృష్టి పెట్టండి సీపీ..

సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుర్వినియోగం సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి అని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుల ఒత్తిడిని అధిగమించేందుకు డ్రగ్స్ వైపు కాకుండా స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీపై దృష్టి సారించాలని యువతకు సూచించారు. కరీంనగర్ను డ్రగ్ రహిత జిల్లాగా మార్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇటీవల వి ద్యా సంస్థల పరిసరాల్లోని 99 పాన్ షాపులపై దాడులు చేసి 52 కేసులు నమోదు చేశామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో అన్ని విద్యాసంస్థల్లో కాన్షియస్ క్లబ్స్ ఏర్పాటు చె శామన్నారు. నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

డ్రగ్స్ సేవించడం, విక్రయించడం ఎన్టీపీఎస్ యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ యువతలో స్వీయ నియంత్రణ ఉంటేనే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి లక్ష్యాలను చేరుకోగలరన్నారు. యాంటీ డ్రగ్స్ వీక్ లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల విజేతలకు సీపీ బహుమతులు అందజేశారు.

అనంతరం అధికారులు, విద్యార్థులు డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ప్రత్యేక సంతకాల సేకరణ బోర్డుపై సీపీ, అతిథులు సంతకాలు చేసి కరీంనగర్ను డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దుతామని సంకల్పించారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, డీడబ్ల్యూఓ సరస్వతి, డీసీపీవో పర్వీన్, ఏసీపీలు వేణుగోపాల్, విజయకుమార్, యాదగిరిస్వామి, యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.