శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు సాయి సుదర్శన్ దూరం..
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌కు భారత జట్టులో మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
కుడి బొటనవేలికి స్ట్రెస్ ఫ్రాక్చర్‌కు గురైన సాయి సుదర్శన్, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అతను ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ, పూర్తి ఫిట్‌నెస్ సాధించనందున శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్య బృందం అతని ఆరోగ్య పురోగతిని పర్యవేక్షిస్తోంది.
సర్ఫరాజ్ ఖాన్ కొలంబోలో భారత జట్టుతో కలవనున్నాడు. ఆ తర్వాత జట్టు గాలేకు వెళ్లనుంది. ఆగస్టు 15 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఔకిబ్ నబీ, సర్ఫరాజ్ ఖాన్.
