లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారికి కవిత బోనం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: బోనాల పండుగ సందర్భంగా లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ ప్రజలందరిపై సింహవాహిని మహంకాళి అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కవిత ప్రార్థించారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖశాంతులతో, ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు.
బోనాల పండుగను పురస్కరించుకుని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోనాలు సమర్పిస్తూ, అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తుల రాకతో సందడిగా మారాయి.
