పంజా సెంటర్ ఉరుసు మహోత్సవంలో ఎంపీ కేశినేని చిన్ని!

  • మత సామరస్యానికి విజయవాడ చిరునామా…

భవానిపురం ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్‌లో ఆదివారం జరిగిన ఉరుసు మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉరుసు మహోత్సవంలో వందలాది మంది భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. “విజయవాడలో అన్ని మతాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారు. మన పండుగలు, సంప్రదాయాలు ఏవైనా.. ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించుకోవడమే మన విజయవాడ ప్రత్యేకత” అని అన్నారు.
“మతం వేరు కావచ్చు.. మనుషులంతా ఒక్కటే. ప్రేమ, సోదరభావం, పరస్పర గౌరవంతో ముందుకు సాగితేనే సమాజంలో శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుంది” అని చిన్ని పేర్కొన్నారు.

పంజా సెంటర్ ఉరుసు మహోత్సవం ప్రతి ఏడాది ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురావడం సంతోషకరమని, ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎంపీ తెలిపారు. ఉరుసు సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు చేసిన ఏర్పాట్లను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లాహ్, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా, మైలపల్లి రాజు,నియోజవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు తమీమ్ అన్సార్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు షేక్ నసీమా,డివిజన్ అధ్యక్షులు గంగాధర్, జాహిద్, నంద కుమారి, విజయలక్ష్మి, కుంచం దుర్గా రావు, తాజుద్దీన్, దాడి మురళి , వడ్డాది రమణ, హబీబ్,, నాయకులు, నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.