పేద ప్రజలకు అండగా మాజీ ఎంపిటిసి..
మర్రిగూడ, ఆంధ్రప్రభ : పేద ప్రజలకు అండగా ఉంటూ తన సొంత ఖర్చులతో హైదరాబాదులోని చిన్మయి హాస్పిటల్ సిబ్బంది సహకారంతో వృద్ధులకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి వారి జీవితంలో వెలుగులు నింపిన చిన్మయి హాస్పిటల్ యజమాని, నామాపురం మాజీ ఎంపీటీసీ సరితానగేష్. ఆయన సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నామాపురం ఎంపిటిసి పరిధి ఇందుర్తి గ్రామంలోని పేద, వృద్ధ ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించారు. తన స్వంత చిన్మయి హాస్పిటల్ సిబ్బంది సహకారంతో గ్రామ ప్రజలకు నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో పలువురికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారు.
ఆపరేషన్ అనంతరం రోగులకు ప్రత్యేక కళ్లద్దాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యజమాని నామాపురం మాజీ ఎంపీటీసీ సరితనగేష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన నేత్ర వైద్యం అందించి వారి జీవితంలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. శిబిరంలో పాల్గొన్న వృద్ధులు ఉచిత వైద్య సేవలు అందించిన మాజీ ఎంపిటిసి సరిత నాగేష్, చిన్మయి హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
