transfer | గుంటూరు కమిషనర్ బదిలీ..

transfer | గుంటూరు కమిషనర్ బదిలీ..
- మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా నియామకం
transfer | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) కమిషనర్ పులి శ్రీనివాసులును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కె. మయూర్ అశోక్ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమితులయ్యారు.
పులి శ్రీనివాసులు గుంటూరు కమిషనర్‌గా పనిచేసిన కాలంలో నగర అభివృద్ధికి, పరిశుభ్రతకు, సమర్థవంతమైన పరిపాలనకు ఎంతో కృషి చేశారు. ఆయన నాయకత్వంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర స్థాయిలో అనేక రంగాల్లో అగ్రస్థానాలు సాధించింది.
స్వచ్ఛ్ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో గుంటూరు దేశవ్యాప్తంగా మంచి ఘనతను సాధించింది. 2024-25లో దేశంలోని 23 నగరాల్లో సూపర్ స్వచ్ఛ్ లీగ్ సిటీస్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాష్ట్రవ్యాప్తంగా ఐవీఆర్‌ఎస్ సర్వేలో పరిశుభ్రత విభాగంలో గుంటూరు అగ్రస్థానం సాధించింది.
రోజువారీ చెత్త సేకరణ, 24 గంటల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీ నిర్వహణ వంటి అంశాల్లో 67% పౌర సంతృప్తి స్కోరు సాధించింది.ఈ–ఆఫీస్ ఫైల్స్ వేగవంతమైన పరిష్కారంలో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. 11,348 ఫైల్స్‌ను రికార్డు సమయంలో (సగటున 1 రోజు 6 గంటలు) పరిష్కరించింది, ఇది పారదర్శకత, సమర్థతకు నిదర్శనంగా నిలిచింది.
పులి శ్రీనివాసులు ఇప్పుడు మార్కాపురం జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన స్థానంలో విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కె. మయూర్ అశోక్ గుంటూరు కమిషనర్‌గా బాధ్యతలు తీసుకుంటారు.
ఈ బదిలీలు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంలో సాధారణ పరిపాలనా మార్పుల భాగంగా జరిగాయి. పులి శ్రీనివాసులు గుంటూరు నగరానికి అందించిన సేవలు, జాతీయ స్థాయి అవార్డులు నగరవాసులకు గుర్తుండిపోయెలా తన ముద్ర ముద్ర వేసుకున్నారు.
