18 lakh people | సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 85 శాతానికి పైగా ఉత్తీర్ణత..

18 lakh people | సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 85 శాతానికి పైగా ఉత్తీర్ణత..
18 lakh people | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈసారి 85 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం సుమారు 3 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. పరీక్షల ఫలితాల్లో బాలికలు మరోసారి బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు.
ఈసారి 88 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలుర ఉత్తీర్ణత శాతం 82గా నమోదైంది. విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్ వివరాలతో CBSE Results Portal వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
