kadem అప్పుల భారం.. మద్యానికి బానిసై..

kadem అప్పుల భారం.. మద్యానికి బానిసై.. అప్పుల భారం.. మద్యానికి బానిసై..

  • వ్యవసాయ కూలీ బలవన్మరణం

(kadem)కడెం, ఆంధ్రప్రభ:

మండలంలోని సారంగాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ సందు రాజేశ్వర్ (48) మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు కడెం పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఏఎస్ఐ మాన్‌సింగ్ తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, రాజేశ్వర్ అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్నాడు. బాకీలు పెరిగిపోవడంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురయ్యాడు. గత ఆరు నెలలుగా మద్యానికి బానిసైన ఆయన కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల భార్యతో జరిగిన గొడవ కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లగా, రాజేశ్వర్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య సందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏఎస్ఐ మాన్‌సింగ్ తెలిపారు.

మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply