ట్రాక్టర్ ప్రమాదం.. యువకుడి మృతి

వర్ని, ఆంధ్రప్రభ : ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాద సంఘటన వర్ని మండలంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వర్ని మండలం కోటయ్య క్యాంపుకు చెందిన భూమేష్ (28) రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదం అనంతరం అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భూమేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply