మహిళల హాకీ ప్రపంచ కప్‌కు రెడీ !!
- మహిళల హాకీ ప్రపంచకప్…
- భారత జట్టు ప్రకటించిన హాకీ ఇండియా
- సలీమా టేటే కెప్టెన్..
- ఆగస్టు 16న చైనాతో తొలి పోరు
- నెదర్లాండ్స్–బెల్జియం సంయుక్త ఆతిథ్యంలో ఆగస్టు 15 నుంచి టోర్నీ
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వచ్చే నెల జరగనున్న ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్–2026 కోసం హాకీ ఇండియా శుక్రవారం 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. మిడ్‌ఫీల్డర్ సలీమా టేటే జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుండగా, ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ శిక్షణ శిబిరంలో ఆటగాళ్లు సన్నాహకాలు కొనసాగిస్తున్నారు.
నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్త ఆతిథ్యంలో ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత్ డీ పూల్‌లో చోటు దక్కించుకుంది. ఈ గ్రూపులో చైనా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.
భారత్ తన తొలి లీగ్ మ్యాచ్‌ను ఆగస్టు 16న చైనాతో ఆడనుంది. అనంతరం ఆగస్టు 18న దక్షిణాఫ్రికా, ఆగస్టు 20న ఇంగ్లండ్‌తో తలపడుతుంది. పూల్ దశలోని అన్ని మ్యాచ్‌లు నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టెల్వీన్ వాగెనర్ హాకీ స్టేడియంలో జరగనున్నాయి.
ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్‌లో భారత్ ఓటమి లేకుండా విజేతగా నిలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
జట్టు ఎంపికపై ప్రధాన కోచ్ స్జోర్డ్ మారినె మాట్లాడుతూ, ప్రపంచకప్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమతుల్యమైన జట్టును ఎంపిక చేశామని తెలిపారు. టోర్నీకి ముందు ఆటగాళ్లు కఠినంగా శ్రమించారని, ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో పోటీ పడేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందనే నమ్మకం వ్యక్తం చేశారు.
భారత జట్టు
- గోల్‌కీపర్లు: సవిత, బిచు దేవి ఖరీబామ్
- డిఫెండర్లు: ఇషికా చౌదరి, సుశీలా చాను పుఖ్రంబమ్, లాల్థాంత్లువాంగి, జ్యోతి, శిల్పి దబాస్
- మిడ్‌ఫీల్డర్లు: నిక్కీ ప్రధాన్, సాక్షి రాణా, సునేలితా టోప్పో, సలీమా టేటే (కెప్టెన్), నేహా, దీపికా సోరెంగ్
- ఫార్వర్డ్స్: లాల్రెమ్సియామి, రుతుజా దాదాసో పిసాల్, నవ్‌నీత్ కౌర్, దీపికా, ఇషికా, బల్జీత్ కౌర్, బ్యూటీ దుంగ్దుంగ్.
