ఆంధ్రప్రభ ఇంపాక్ట్

ఆంధ్రప్రభ ఇంపాక్ట్
మిషన్ భగీరథ మరమ్మతులు పూర్తి చేశాం
ఏఈ అస్మిత
దండేపల్లి, ఆంధ్రప్రభ : వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు పట్టించుకోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అనే ఆంధ్రప్రభ కథానానికి అధికారులు స్పందించారు. దండేపల్లి మండలంలోని మెదరిపేట గ్రామ పంచాయతీ లోని గాజుల సావిత్రి ఇంటిముందు మిషన్ భగీరథ నీరు పైపు లైన్ ద్వారా లీకేజీ అవుతున్న తాగునీరు వృధాగా పోవడంతో ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి పైపులైన్ మరమ్మత్తు పనులను గురువారం పూర్తి చేసినట్లు ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ అస్మిత తెలిపారు.
ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయితే తమ దృష్టికి తీసుక వస్తే వెంటనే మరమ్మతు పనులు చేపడతామన్నారు. లీకేజీ అవుతున్న పైపు లైన్లను పరిశీలించి ఉన్నత అధికారులతో మాట్లాడి వారి సమన్వయంతో మరమ్మతులు పూర్తి చేశామని వివరించారు.
