రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి…

తిమ్మాపూర్, ఆంధ్రప్రభ ; కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ రాజీవ్ రహదారిపై సోమవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది… పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదంలో వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందాడు.మృతుడు గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన కంతల రాజిరెడ్డి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఎల్ ఎల్ ఎమ్ డి పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండిఎస్ఐ అన్వర్ తెలిపారు.

Leave a Reply