ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకం
ఉట్నూర్ రూరల్,ఆంధ్రప్రభ: ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ఒక్కరు కూడ మిస్ కావద్దని ఆదిలాబాద్ ఆర్టిఏ నెంబర్ కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ దూట రాజేశ్వర్, జై నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంతరావు అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు వారు బి ఎల్ ఓ, కలిసి సోమవారం మండలంలోని లక్కారం గ్రామ పంచాయతీలోని బూత్ నెంబర్ 86 లో తిరిగి ఎస్ఐఆర్ సర్వే పారాలను పంపిణీ చేశారు. ఈ సర్వే యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరు సర్వేపారాలను నింపి ఓటు హక్కు పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ పద్మ ప్రజలు పాల్గొన్నారు.
