జర్నలిస్టులకు కేటాయించిన భూమి కబ్జా యత్నంపై చర్యలు తీసుకోవాలి

తహసిల్దార్‌కు ప్రెస్ క్లబ్ వినతి

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారులో జర్నలిస్టులకు కేటాయించిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సాయంత్రం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు మండల తహసిల్దార్ కృష్ణలాల్‌కు వినతిపత్రం అందజేశారు.

ఆదివారం రాత్రి ట్రాక్టర్లు, జేసీబీలతో జర్నలిస్టులకు కేటాయించిన భూమిని దున్ని చదును చేసి కబ్జా చేసేందుకు పట్టణ ఆరోగ్య కేంద్ర హెల్త్ అసిస్టెంట్ గీస రాజేశం, ఐకేపీ ఉద్యోగి నాథరి ప్రసాద్ ప్రయత్నించారని వినతిపత్రంలో పేర్కొన్నారు. జర్నలిస్టులకు కేటాయించిన భూమిని పరిరక్షించి, కబ్జా యత్నానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు రాంశెట్టి వల్లభాయి, అధ్యక్షుడు పులియాల రాజు, ఉపాధ్యక్షుడు కోల వెంకటేష్, కోశాధికారి వికాస్ యాదవ్, నాయకులు అనుదీప్ పటేల్, బడుగు శ్రీనివాస్, కల్వల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.